ఘరోండ బిల్డర్స్ ఎండీకి జైలు శిక్ష... తెలంగాణ వినియోగదారుల కమిషన్ అరుదైన తీర్పు
- కమిషన్ చరిత్రలో అరుదైన తీర్పు
- ఘరోండ బిల్డర్స్ ఎండీకి జైలు శిక్ష
- 3 కేసుల్లో 6 నెలల చొప్పున జైలు శిక్ష ఖరారు
తెలంగాణ వినియోగదారుల కమిషన్ చరిత్రలోనే గురువారం ఓ అరుదైన తీర్పు వెలువడింది. ఓ కంపెనీ ఎండీకి జైలు శిక్ష విధిస్తూ గురువారం కమిషన్ కీలక తీర్పు చెప్పింది. ఘరోండ బిల్డర్స్ ఎండీపై కమిషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై విచారణ సాగించిన కమిషన్... ఆ సంస్థ ఎండీ సునీల్ జే. సచ్‌దేవ్‌కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. మూడు కేసుల్లో ఒక్కో కేసుకు 6 నెలల చొప్పున సచ్‌దేవ్‌కు జైలు శిక్ష విధిస్తూ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా సచ్‌దేవ్‌కు ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. ఇలా ఓ కంపెనీ ఎండీకి జైలు శిక్ష విధిస్తూ కమిషన్ తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి.