సీఎం జగన్‌తో మేకపాటి విక్రమ్ రెడ్డి భేటీ
- ఇటీవలే మరణించిన మంత్రి గౌతమ్ రెడ్డి
- ఫలితంగా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
- గౌతమ్ రెడ్డి సోదరుడికి అవకాశం కల్పించాలంటున్న మేకపాటి ఫ్యామిలీ
- జగన్‌తో భేటీలో రాజమోహన్ రెడ్డితో పాటు పాల్గొన్న విక్రమ్ రెడ్డి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో గురువారం సాయంత్రం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీ అయ్యారు. తన కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని వెంటబెట్టుకుని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజమోహన్ రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు.
జగన్ కేబినెట్‌లో పరిశ్రమల శాఖ మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవలే గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. గౌతమ్ రెడ్డి మరణంతో నెల్లూరు జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థిత్వం మేకపాటి కుటుంబ సభ్యులకే దక్కనుంది. ఈ టికెట్‌ను గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి కేటాయించాలని మేకపాటి ఫ్యామిలీ కోరుతోంది. ఇదే విషయంపై చర్చించేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు.