నోరు జారి పోలీసుల మనసు నొప్పించా: పట్నం మహేందర్ రెడ్డి పశ్చాత్తాపం
- పోలీసులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తానన్న మహేందర్ రెడ్డి
- శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి అభినందనీయమని కితాబు
- పోలీసులంటే తనకు ఎనలేని గౌరవమన్న మహేందర్ రెడ్డి
తాండూరు పట్టణ సీఐని దుర్భాషలాడిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా ఆ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నోరు జారి పోలీసుల మనసు నొప్పించానని పేర్కొన్న మహేందర్ రెడ్డి.. ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు.
తాండూరు ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డికి తనకంటే అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ తాండూరు టౌన్ సీఐపై మహేందర్ రెడ్డి బూతు పురాణం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బయటకు వచ్చిన ఫోన్ కాల్ ఆడియో బుధవారం నాడు మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై టీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ కాగా...తాజాగా మహేందర్ రెడ్డి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. "నోరు జారి పోలీసుల మనసు నొప్పించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. పోలీసులను నా కుటుంబ సభ్యులుగా భావిస్తా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, శాంతి భద్రతల విషయంలో పోలీసుల కృషి అభినందనీయం. పోలీసులంటే నాకు ఎనలేని గౌరవం ఉంది" అని మహేందర్ రెడ్డి ఈ ప్రకటనలో పేర్కొన్నారు.