స్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్టు కార్యక్రమంలో వెంక‌య్య‌.. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఉప‌రాష్ట్రప‌తి

  • నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉప‌రాష్ట్రప‌తి
  • గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలోస్వ‌ర్ణ భార‌త్ ట్ర‌స్టులో ఉచిత వైద్య శిబిరం
  • సేవ‌ను మించిన భ‌గ‌వ‌దారాధ‌న లేద‌న్న వెంక‌య్య‌
  • యువత ఆరోగ్యంపై ఉప‌రాష్ట్రప‌తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
ఉప‌రాష్ట్రప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు గురువారం నెల్లూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. జిల్లాలోని వెంక‌టాపురంలో కొన‌సాగుతున్న స్వ‌ర్ణ‌భార‌త్ ట్ర‌స్ట్‌కు వెళ్లిన వెంక‌య్య‌.. అక్క‌డ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న చెన్నై గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ వైద్య బృందానికి ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సేవ‌కు మించిన భ‌గ‌వ‌దారాధ‌న లేద‌ని, సేవ‌తో ల‌భించే తృప్తి అనిర్వ‌చ‌నీయ‌మైన‌ద‌ని పేర్కొన్నారు.

యువ‌త ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌ని సూచించిన వెంక‌య్య‌... పాశ్చాత్య ఆహార‌పు అల‌వాట్ల‌ను వీడి భార‌తీయ సంప్ర‌దాయ వంట‌కాల‌పై దృష్టి సారించాల‌ని సూచించారు. పాశ్చాత్య పోక‌డ‌ల కార‌ణంగా ఆరోగ్యాన్ని యువ‌త ప్ర‌మాదంలో ప‌డ‌వేసుకుంటోంద‌ని, దేశానికి భ‌విష్య‌త్తు అయిన యువ‌త ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుందిని ఆయన అభిప్రాయ‌ప‌డ్డారు.


More Telugu News