ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత

  • చిత్తూరుకు చెందిన సుంద‌ర‌నాయుడు
  • ప‌శు వైద్యుడిగా వృత్తి జీవితం ప్రారంభం
  • బాలాజీ హ్యాచ‌రీస్‌తో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌గా ప్ర‌స్థానం
  • ఏపీ పౌల్ట్రీ స‌మాఖ్య అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన వైనం
తెలుగు నేల గ‌ర్వించ‌ద‌గిన తొలితరం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌, బాలాజీ హాచ‌రీస్ వ్య‌వస్థా‌ప‌కుడు సుంద‌ర‌నాయుడు గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం 4 గంట‌ల స‌మ‌యంలో కన్నుమూశారు.

ఉమ్మ‌డి ఏపీలో తొలి త‌రం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌గా ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన సుంద‌ర‌నాయుడు బాలాజీ హ్యాచ‌రీస్‌ను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగారు. చిత్తూరు న‌గ‌రానికి చెందిన సుంద‌ర‌నాయుడు పశు వైద్యుడిగా త‌న వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ త‌ర్వాత బాలాజీ హ్యాచరీస్ పేరిట పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఆయ‌న ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా ఎదిగారు. ఏపీ పౌల్ట్రీ స‌మాఖ్య అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించిన నాయుడు... కోళ్ల ప‌రిశ్ర‌మ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఎంద‌రో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆయ‌న ఆద‌ర్శంగా నిలిచారు.


More Telugu News