ఐపీఎల్ సీజన్ మధ్యలో ముంబయి ఇండియన్స్ జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ కుర్రాడు
- ముంబయి జట్టులో గాయపడిన అర్షద్ ఖాన్
- అతడి స్థానంలో కుమార్ కార్తికేయ ఎంపిక
- రూ.20 లక్షలకు కొనుగోలు చేసిన ముంబయి
- దేశవాళీ సీజన్ లో విశేషంగా రాణించిన కార్తికేయ
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఒక దిగ్గజ జట్టు. రికార్డు స్థాయిలో ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలిచిన ఆ జట్టు ప్రస్తుతం పేలవ ఆటతీరు కనబరుస్తున్నప్పటికీ, ఆ జట్టులో స్థానం లభించడమంటే ఆషామాషీ కాదు. కానీ, మధ్యప్రదేశ్ కు చెందిన స్పిన్నర్ కుమార్ కార్తికేయ బంపర్ చాన్స్ కొట్టేశాడు.
ముంబయి ఇండియన్స్ జట్టులో ఎడమచేతివాటం పేస్ బౌలర్ అర్షద్ ఖాన్ ఇటీవల నెట్స్ లో గాయపడ్డాడు. ఇప్పుడు అతడి స్థానంలోనే కుమార్ కార్తికేయను ముంబయి యాజమాన్యం రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కుమార్ కార్తికేయ భారత దేశవాళీ క్రికెట్లో 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 35 వికెట్లు తీశాడు. గత సీజన్ లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ కుమార్ కార్తికేయ తనదైన ముద్ర వేశాడు.