కశ్మీర్ లో సమంత బర్త్ డే.. పిక్స్ వైరల్

  • ఇవాళ 35వ పడిలోకి సామ్
  • కశ్మీర్ లో షూటింగ్.. టీంతోనే వేడుక
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు 
నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన తొలిపుట్టినరోజును జరుపుకొంటోంది. ఇవాళ ఆమె 35వ పడిలోకి అడుగుపెట్టింది. ఆ పుట్టినరోజు వేడుక గుర్తుండిపోయేలా ఆమె కశ్మీర్ లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం సమంత చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ తో తీరిక లేకుండా ఉంది. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్ షెడ్యూల్ కోసం ఆమె కశ్మీర్ లో ఉంది. 

ఇదే టైంలో బర్త్ డే రావడం.. అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగిపోయింది. ఆ మినీ సెలబ్రేషన్స్ కు సంబంధించి ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమన్నా, నీరజ కోన, దివ్య దర్శిని వంటి వాళ్లు శుభాకాంక్షలతో ఆమెను ముంచెత్తారు. ఇక, చిన్న కుటుంబం నుంచి వచ్చి అంతెత్తుకు ఎదగడం.. ఎదిగిన తర్వాత లేని వారికి సేవ చేయడంలో అందరికీ సమంత స్ఫూర్తి అంటూ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.


More Telugu News