కుటుంబంతో వెళ్లి చూసేలా సినిమాలు ఉండాలి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

  • ద‌ర్శ‌కులు, పాటలు, మాటల రచయితలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలన్న ఉప రాష్ట్రప‌తి
  • సినిమాల్లో అశ్లీలత, హింస‌ పెరిగిపోతున్నాయని వ్యాఖ్య‌
  • ప్రతి ప్రాంతంలో గ్రంథాలయం, దేవాలయం ఉండాల‌ని సూచ‌న‌
నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో ఉప రాష్ట్రప‌తి వెంకయ్య నాయుడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ... కుటుంబంతో వెళ్లి చూసేలా సినిమాలు ఉండాలని అన్నారు. ద‌ర్శ‌కులు, పాటలు, మాటల రచయితలు ఆ విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. సినిమాల్లో అశ్లీలత, హింస‌ పెరిగిపోతున్నాయని ఆయ‌న చెప్పారు. 

ప్రతి ప్రాంతంలో గ్రంథాలయం, దేవాలయం, వైద్యాలయం, సేవాలయం ఉండాలని ఆయ‌న అన్నారు. ప్ర‌తి పౌరుడు త‌మ గ్రామానికి ఏదో ఒక సహాయం చేయాలని ఆయ‌న చెప్పారు. తాము 21 సంవత్సరాల ముందు స్వర్ణ భారత్ ట్రస్ట్ ను సేవా దృక్పథంతో ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అభివృద్ధి పథంలో భార‌త్ ముందుకు వెళుతోందని చెప్పారు. అందరూ ఆరోగ్యకరంగా ఉండేందుకు వ్యాయామం చేయాలని అన్నారు.



More Telugu News