అజయ్ దేవగణ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం సిద్ధరామయ్య స్పందన!
- హిందీ ఎప్పటికీ జాతీయ భాష కాదన్న సిద్ధరామయ్య
- దేశ భాషల భిన్నత్వాన్ని అందరూ గౌరవించాలని వ్యాఖ్య
- కన్నడిగ అయినందుకు ఎంతో గర్విస్తున్నానన్న మాజీ సీఎం
హిందీ భాషకు సంబంధించి కన్నడ హీరో కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ల మధ్య ట్విట్టర్ వేదికగా వాదన జరిగిన సంగతి తెలిసిందే. హిందీ ఇకపై ఎంత మాత్రం జాతీయ భాష కాదని సుదీప్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా హిందీ ఎప్పటికీ జాతీయ భాషేనని అజయ్ దేవగణ్ అన్నారు. హిందీ జాతీయ భాష కానప్పుడు మీ మాతృభాష చిత్రాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు.
అజయ్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. అజయ్ ట్వీట్ పై సిద్ధరామయ్య చెబుతూ... 'హిందీ ఎప్పటికీ మన జాతీయ భాష కాదు. మన దేశ భాషల భిన్నత్వాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ప్రతి భాషకు కూడా దాని గొప్ప చరిత్ర ఉంటుంది. వారి మాతృ భాష పట్ల ఆయా ప్రజలు ఎంతో గర్విస్తుంటారు. కన్నడ వ్యక్తిని అయినందుకు నేను ఎంతో గర్విస్తున్నా' అని వ్యాఖ్యానించారు.