నిరసనకు వెళ్లిన నారా లోకేశ్... గజ మాలతో ఆహ్వానించిన టీడీపీ శ్రేణులు
- డోలాస్ నగర్‌లో పర్యటించిన నారా లోకేశ్
- ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ
- ప్రజల సమస్యలపై ఆరా తీసిన టీడీపీ నేత
ఏపీలో వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా టీడీపీ చేపట్టిన బాదుడే బాదుడు నిరసనల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లి టౌన్ డోలాస్ నగర్ లో పర్యటించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... అక్కడి ప్రజలకు విసనకర్ర, కొవ్వొత్తి, అగ్గిపెట్టె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ శ్రేణులు గజమాలతో ఘన స్వాగతం పలికాయి.
పర్యటనలో భాగంగా ప్రజలతో మమేకం అయిన లోకేశ్... వారి సమస్యలపై ఆరా తీశారు. ఇళ్ల పట్టాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్‌తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు, ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గెలిచిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ప్రజలపై కక్ష కట్టి ఇళ్లు కూల్చడం మొలదలెట్టారని లోకేశ్ ధ్వజమెత్తారు.