టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ జరిమానాలు...మంత్రి తలసానికి రూ.50 వేల ఫైన్
- టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు
- ఫ్లెక్సీలపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదుల వెల్లువ
- మంత్రి తలసాని సహా మరో ముగ్గురికి ఫైన్ విధింపు
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలపై జరిమానాలు విధిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జరిమానాలకు గురైన వారిలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు. ఆయన ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై అధికారులు రూ.50 వేల జరిమానా విధించారు.
టీఆర్ఎస్ ప్లీనరీని పురస్కరించుకుని ఆ పార్టీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించాలని మంగళవారమే బీజేపీ నేతలు అధికారులను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం ఈ ఫ్లెక్సీలపై సోషల్ మీడియాలో అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఫ్లెక్సీలపై అధికారులు జరిమానాలు విధించారు. ఇందులో భాగంగా తలసానికి రూ.50 వేలు ఫైన్ వేసిన అధికారులు... మైనంపల్లి రోహిత్‌కు రూ.40 వేలు, దానం నాగేందర్‌కు రూ.5 వేలు, కాలేరు వెంకటేశ్ కు రూ.10 వేలు జరిమానా విధించారు.