టీఆర్ఎస్ ప్లీనరీలో.. మంత్రిపై హత్యాయత్నం నిందితుడు ప్రత్యక్షం
- మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు మున్నూరు రవి
- సెక్యూరిటీ బార్ కోడ్ ఉన్న పాసు లేకున్నా వేడుకకు హాజరైన రవి
- నేతలతో ఫొటోలు దిగిన వైనం
టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో బుధవారం జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పార్టీ కీలక నేత, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నూరు రవి ప్రత్యక్షమయ్యాడు. పార్టీ వేడుకకు హాజరైన అతడు పార్టీ నేతలతో కలిసి ఫొటోలు దిగాడు. ఈ వ్యవహారం పార్టీ ప్లీనరీలో కలకలం రేపింది.
పార్టీ ప్లీనరీకి హాజరయ్యే నేతలకు పార్టీ సెక్యూరిటీ, బార్ కోడ్‌లున్న పాసులను జారీ చేసింది. ఈ పాసులున్న వారే పార్టీ వేడుకకు హాజరు కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచించారు కూడా. అయితే మున్నూరు రవికి ఈ పాస్ లేకున్నా అతడు పార్టీ ప్లీనరీ ఎలా హాజరయ్యాడన్న విషయంపై పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అయితే కేవలం పార్టీ ఐడీ కార్డుతోనే మున్నూరు రవి పార్టీ వేడుకకు హాజరయ్యాడని ఆ తర్వాత తెలిసింది. పార్టీ వేడుకలో అధినేత కేసీఆర్ కీలక ప్రసంగం చేస్తున్న సమయంలో కూడా మున్నూరు రవి ఇంకా అక్కడే ఉన్న వైనంపైనా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.