175కి 175 సీట్లు ఎందుకు రాకూడ‌దు?.. నేత‌ల‌తో స‌మీక్ష‌లో జ‌గన్ కామెంట్‌

  • మంత్రులు, రీజ‌న‌ల్‌, జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌తో జ‌గ‌న్ భేటీ
  •  151 సీట్లకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌గ్గకూడదన్న అధినేత  
  • ఎమ్మెల్యేలు నెల‌కు 10 స‌చివాల‌యాలు తిర‌గాల‌న్న జ‌గ‌న్‌
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ముఖ్య నేత‌లు, మంత్రులు, పార్టీ రీజ‌న‌ల్ కో ఆర్డినేట‌ర్లు, జిల్లా అధ్య‌క్షుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 175 సీట్లుంటే... వాట‌న్నింటిలోనూ వైసీపీ ఎందుకు గెల‌వకూడ‌ద‌ని జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్ చేశారు. అస‌లు 175కీ 175 సీట్లు మ‌న‌కు ఎందుకు రాకూడ‌దు? అంటూ జ‌గ‌న్ ప్రశ్నించారు.  

2024 ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు ర‌చించేందుకు జ‌రిగిన ఈ స‌మావేశంలో జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ... 'మంత్రులు అంద‌రినీ క‌లుపుకుని వెళ్లాలి. ప్ర‌తి ఎమ్మెల్యే నెల‌కు 10 స‌చివాల‌యాలు తిర‌గాలి. గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు గెలిచాం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ సీట్ల సంఖ్య త‌గ్గ‌కూడ‌దు. అస‌లు 175కి 175 సీట్లు ఎందుకు రాకూడు?' అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.


More Telugu News