మోదీ పెట్రో వ్యాఖ్య‌ల‌కు ఘాటు కౌంట‌రిచ్చిన కాంగ్రెస్‌

  • పెట్రో ధ‌ర‌ల‌కు రాష్ట్రాలే కార‌ణ‌మ‌న్న‌మోదీ
  • మోదీ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన ప‌వ‌న్ ఖేరా
  • పెట్రో ధ‌ర‌ల పెంపుతో రూ.26 ల‌క్ష‌ల కోట్లు సంపాదించార‌ని ఆరోప‌ణ‌
  • వ్యాట్ త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌ను కోర‌డం విడ్డూర‌మ‌న్న కాంగ్రెస్ నేత‌
దేశంలో పెట్రో ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలే కార‌ణ‌మంటూ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బుధవారం నాడు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ పార్టీ వేగంగా రియాక్ట్ అయ్యింది. మోదీ వ్యాఖ్య‌ల‌కు ఘాటు కౌంట‌ర్లు ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం కార‌ణంగానే దేశంలో పెట్రో ధ‌ర‌లు పెరుగుతున్నాయంటూ ఆ పార్టీ కీల‌క నేత ప‌వ‌న్ ఖేరా ఆరోపించారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ఖేరా మాట్లాడుతూ... "పెట్రో ధ‌ర‌లు పెంచి రూ.26 ల‌క్ష‌ల కోట్లు సంపాదించారు. అందులో రాష్ట్రాల‌కు మాత్రం వాటా ఇవ్వ‌డం లేదు. జీఎస్టీ వాటాల‌ను స‌రైన స‌మ‌యంలో ఇవ్వ‌ని కేంద్రం వ్యాట్ త‌గ్గించాల‌ని రాష్ట్రాల‌ను కోర‌డం విడ్డూరం" అని ఆయ‌న కేంద్రంపై విరుచుకుప‌డ్డారు.


More Telugu News