గుడివాడ మట్టి మాఫియాలో కీలక పరిణామం... బాధిత ఆర్ఐపై కేసు నమోదు
- ఆర్ఐపై అవినీతి ఆరోపణలు
- లంచం అడిగారంటూ పోలీసులకు లక్ష్మణరావు ఫిర్యాదు
- ఫిర్యాదు ఆధారంగా ఆర్ఐతో పాటు గ్రామ సేవకులపైనా కేసు
ఏపీలో కలకలం రేపిన గుడివాడ మట్టి మాఫియా ఘటనలో బుధవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మట్టి మాఫియా తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లి మాఫియా ప్రతినిధుల చేతిలో దాడికి గురైన ఆర్ఐ అరవింద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఐతో పాటు ఇద్దరు గ్రామ సేవకులపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు.
మట్టి తవ్వకాలకు సంబంధించి ఆర్ఐ అరవింద్ తమను లంచం అడిగారంటూ గంటా లక్ష్మణరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్ఐ అరవింద్‌తో పాటు అతడి వెంట వెళ్లిన ఇద్దరు గ్రామ సేవకులపైనా లంచం కేసులు నమోదు అయ్యాయి. లంచం ఇవ్వనందుకు అర్థరాత్రి వేళ పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన ఆర్ఐ అరవింద్ పనులను నిలిపివేశారని లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.