ట్విట్టర్, టిక్‌టాక్‌లను దాటేసిన ట్రూత్ సోషల్.. ఆధారాలు చూపిన ఎలాన్ మస్క్
- యాపిల్ స్టోర్ గణాంకాలను వెల్లడించిన మస్క్
- తొలి స్థానం ఆక్రమించిన ట్రూత్ సోషల్
- రెండో స్థానంలో ట్విట్టర్, ఐదో స్థానంలో టిక్ టాక్
సోషల్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్ హవా నడుస్తోంది. టిక్ టాక్ కూడా ఓ రేంజిలోనే దూసుకుపోతోంది. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్న నేపథ్యంలో ఈ రెండింటి హవా ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పలేం. ఆ మాటే నిజమంటున్నారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్. ఏకంగా 44 బిలియన్ డాలర్లు పెట్టి మరీ ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్న ఆయన.. తాను హస్తగతం చేసుకుంటున్న ట్విట్టర్ ను మరో సోషల్ మీడియా దాటిపోతున్న వైనాన్ని అప్పుడే పసిగట్టేశారు.
ఈ మేరకు ట్విట్టర్, టిక్‌టాక్‌లను ట్రూత్ సోషల్ దాటేసి వెళ్లిపోతున్న వైనాన్ని ఆయన ఆధారాలతో సహా బయటపెట్టారు. యాపిల్ స్టోర్‌లో ట్విట్టర్‌ను దాటేసి ట్రూత్ సోషల్ తొలి స్థానంలో నిలిచింది. ఇక టిక్ టాక్ అయితే ఎక్కడో ఐదో స్థానంలో నిలిచింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో లివిన్, బీ రియల్ లు కొనసాగుతున్నాయి. తాను కొనుగోలు చేస్తున్న ట్విట్టర్‌ను దాటేసి సోషల్ ట్రూత్ దూసుకుపోతున్న విషయాన్ని పసిగట్టిన ఎలాన్ మస్క్.. మరి ట్విట్టర్ స్పీడును ఎలా పెంచుతారో చూడాలి.