జగన్ కీలక సమావేశం... 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలపై సమాలోచన
- వైసీపీ అధినేత హోదాలో జగన్ సమావేశం
- పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కో ఆర్డినేటర్ల హాజరు
- మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ ఆహ్వానం
- ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చించనున్న జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో ఓ కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైసీపీ అధినేత హోదాలో జగన్ నిర్వహించనున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలో వివిధ స్థాయుల్లో ఉన్న కీలక నేతలంతా హాజరు కానున్నారు. పార్టీలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ భేటీలో కీలకంగా మారనున్నారు.
వైసీపీ ఎన్నికల్లో విజయం సాధించి మూడేళ్లు దాటిపోతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ ఈ భేటీలో కీలక సమాలోచనలు చేయనున్నారు. అనుభవం ఉన్న పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్న ఆయన ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.