ఎల్ఐసీ ఐపీవో: ఒక్కో షేర్ ధర ఎంతంటే...!
- షేర్ ధరల్లో సవరణలు చేసిన ప్రభుత్వం
- రూ.902 నుంచి రూ.949 మధ్య ఖరారు
- రిటెయిల్ మదుపరులు, ఉద్యోగులకు రూ.40 డిస్కౌంట్
- ఎల్ఐసీ పాలసీదారులకు రూ.60 రిబేటు
ఎల్ఐసీ ఐపీవోకు మరికొన్ని రోజుల టైమే ఉంది. అందరూ దాని కోసమే వేచి చూస్తున్నారు. అయితే, తాజాగా మార్కెట్ లో లిస్టింగ్, ఐపీవోకు సంబంధించి సంస్థ షేరు ధరలను ప్రభుత్వం సవరించినట్టు తెలుస్తోంది. రూ.902 నుంచి రూ.949 మధ్య ప్రైస్ బ్యాండ్ ను సెట్ చేసిందని ఎల్ఐసీ అధికార వర్గాలు చెబుతున్నాయి. తద్వారా గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ ద్వారా రూ.21 వేల కోట్లు సమీకరించాలన్న టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
కాగా, రిటెయిల్ మదుపరులు, ఉద్యోగులకు రూ.40, పాలసీదారులకు రూ.60 చొప్పున డిస్కౌంట్ ఇవ్వాలని సంస్థ భావిస్తున్నట్టు సమాచారం. మే 4న ఐపీవో ఓపెన్ అవుతుందని, మే 9న ముగుస్తుందని చెబుతున్నారు. కాగా, ప్రైస్ బ్యాండ్, యాంకర్ ఇన్వెస్టర్లకు మే 2 నుంచే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. గ్రీన్ షూ ఆప్షన్ ఉండబోదని చెబుతున్నారు.
కాగా, ఎల్ఐసీలో 3.5 శాతం వాటా అమ్మేయడం ద్వారా 274 కోట్ల డాలర్లను సమీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అది అంతకుముందు అంచనా వేసిన మొత్తంలో కేవలం మూడో వంతు. ప్రస్తుతం ఎల్ఐసీ సంస్థ విలువ రూ.6 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు అది రూ.17 లక్షలు కావడం గమనార్హం. కొత్త రేటు ప్రకారం కనిష్ఠ ప్రైస్ బ్యాండ్ ప్రకారం 261 కోట్ల డాలర్లు సమకూరనున్నాయి.
పాలసీదారులు, షేర్ హోల్డర్లకు పోనూ మిగిలిన షేర్లను మిగతా వారికి అలాట్ చేస్తారు. అందులో క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ)కి 50 శాతం, రిటెయిల్ బయ్యర్స్ కు 35 శాతం, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం చొప్పున షేర్లను కేటాయించనున్నారు. క్యూఐబీలకు కేటాయించే షేర్లలో 60 శాతం షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు అలాట్ చేయనున్నారు.