సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ 21 ప్రశ్నలు
- మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా? అని సంజయ్ ప్రశ్న
- ఈ 21 ప్రశ్నలకైనా కనీసం మీరు సమాధానం చెప్పాలని డిమాండ్
- పెట్రోల్ డీజిల్ ధరలపై చర్చించడానికి మీరు సిద్ధమా? అని సవాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అస్యతాలు చెబుతూ ప్రజలను కేసీఆర్ మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ గారు.. మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా? కనీసం మీ పార్టీ ఘనంగా జరుపుకుంటున్న 21వ ప్లీనరీ సందర్భంగా అయినా బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరఫున మేము అడిగే 21 ప్రశ్నలకైనా కనీసం మీరు సమాధానం చెప్పాలి అంటూ ఓ ప్రకటనలో బండి సంజయ్ పేర్కొన్నారు.
2014లో 32 పేజీలు, 2018లో 16 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఎన్ని అమలు చేశారో చర్చించడానికి కేసీఆర్ సిద్ధమేనా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కనీసం ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని ఆయన నిలదీశారు.
దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో అధికంగా ఉన్న మాట వాస్తవం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి? తెలంగాణలో ఎంత ఉన్నాయి? అని ఆయన నిలదీశారు. దీనిపైన చర్చించడానికి మీరు సిద్ధమా? అని సవాలు విసిరారు.