మౌనం వీడండి.. ద్వేష రాజకీయాలకు చెక్ పెట్టండి: ప్రధానికి మాజీ బ్యూరోక్రాట్ల లేఖ

  • విద్వేష రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయంటూ విమర్శ 
  • రాజ్యాంగ నైతికతకు ప్రమాదమంటూ వ్యాఖ్య 
  • వాటిని ముగించాలని పిలుపు ఇవ్వండంటూ విజ్ఞప్తి 
మౌనం వీడాలని, దేశంలో విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలని కోరుతూ 100 మంది మాజీ బ్యూరోక్రాట్లు (జాతీయ సర్వీసుల మాజీ అధికారులు) ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. 

‘‘మనం ఎదుర్కొంటున్న ముప్పు అసాధారణమైనది. రాజ్యాంగ నైతికత, ప్రవర్తన ప్రమాదంలో పడింది. ఇది మన సామాజిక విశిష్టత. గొప్ప నాగరికత, వారసత్వం. రాజ్యాంగ పరిరక్షణకు రూపొందించబడినది. ఇది చీలిపోయే ప్రమాదం నెలకొంది. ఈ అపారమైన సామాజిక ముప్పు విషయంలో మీరు పాటిస్తున్న మౌనం బధిరత్వంతో సమానం’’ అని లేఖలో వారు పేర్కొన్నారు.
 
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అన్న హామీని నిలబెట్టుకోవాలని వారు ప్రధానికి సూచించారు. మీ పార్టీ నియంత్రణలోని ప్రభుత్వాల పరిధిలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ పిలుపు ఇవ్వాలని కోరారు. మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాత సింగ్, హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై తదితరులు లేఖ రాసిన వారిలో ఉన్నారు. 




More Telugu News