'ఆచార్య' చేయలేకపోయిన బాధ ఎప్పటికీ ఉంటుంది: అయ్యప్ప శర్మ
- అప్పుడు కన్నడ సినిమా షూటింగులో ఉన్నానన్న అయ్యప్ప
- అప్పుడే 'ఆచార్య' కోసం కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించారని వెల్లడి
- అక్కడ మొబైల్ నెట్ వర్క్ ఉండేది కాదన్న అయ్యప్ప
- అందువలన ఛాన్స్ పోయిందని వివరణ
చిరంజీవి కథానాయకుడిగా రూపొందిన 'ఆచార్య' ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, చరణ్ - పూజ హెగ్డే ముఖ్యమైన పాత్రలను పోషించారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సాయికుమార్ సోదరుడు అయ్యప్ప శర్మ ప్రస్తావించాడు.
"నేను ఓ కన్నడ సినిమా షూటింగు కోసం ఒక మారుమూల గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. అక్కడ ఎలాంటి నెట్ వర్క్ ఉండేది కాదు. ఆ సమయంలో 'ఆచార్య' సినిమా కోసం నన్ను కాంటాక్ట్ చేశారట. వాళ్లు పెట్టిన మెసేజ్ కూడా నాకు ఆ తరువాత ఎప్పటికో వచ్చింది. వాళ్లు అడిగిన డేట్లు ఉండి కూడా నెట్వర్క్ సమస్య కారణంగా నేను 'ఆచార్య' చేయలేకపోయాను.
చిరంజీవిగారితో కలిసి సినిమా చేయలేకపోయానే అనే బాధ నన్ను అలా వెంటాడుతూనే ఉంది. మా నాన్నగారి హయాం నుంచి చిరంజీవిగారి ఫ్యామిలీతో మంచి స్నేహ సంబంధం ఉంది. సాయికుమార్ నుంచి ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది. చిరంజీవిగారితో కలిసి నటించే ఛాన్స్ త్వరలోనే మళ్లీ వస్తుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.