దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు... రేపు సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం

  • భారత్ లో మళ్లీ పుంజుకుంటున్న కరోనా
  • అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివిటీ రేటు
  • దిశానిర్దేశం చేయనున్న ప్రధాని 
భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పుంజుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ రేపు సమావేశం కానున్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. తొలుత, దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. అనంతరం, సీఎంలు తమ పరిధిలో తీసుకుంటున్న చర్యలను ప్రధానికి వివరిస్తారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత స్థితిగతులపై మోదీ సీఎంలకు దిశానిర్దేశం చేస్తారు.


More Telugu News