సుప్రీంకోర్టులో ఎంఎస్ ధోనీ పిటిషన్.. మే 6న విచారణ
- ఆమ్రపాలి కంపెనీతో ధోనీకి వివాదం
- కోర్టు జోక్యాన్ని కోరిన ధోనీ
- ఆ మేరకే పిటిషన్ దాఖలు చేసిన కెప్టెన్ కూల్
టీమిండియా మాజీ క్రికెటర్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మంగళవారం నాడు ఓ పిటిషన్ దాఖలు చేశాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును తన పిటిషన్‌లో అభ్యర్థించాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం దానిపై మే 6న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
2009-2016 మధ్యలో ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన ధోని.. తనకు రావాల్సిన రూ.40 కోట్ల పారితోషికం మొత్తాన్ని సదరు కంపెనీ ఎగ్గొట్టిందని గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థతో నెలకొన్న వివాదంలో మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించాడు.