ప్రగతి భవన్ కు వెళ్లాక ప్రశాంత్ కిశోర్ మనసు మార్చుకున్నారు: వీహెచ్
- కాంగ్రెస్ పార్టీలో చేరడంలేదని ప్రశాంత్ కిశోర్ వెల్లడి
- సలహాదారుగా వ్యవహరిస్తానని స్పష్టీకరణ
- పార్టీలో పీకే చేరిక అంశాన్ని కొందరు వ్యతిరేకించారన్న వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న సోనియా గాంధీ ఆహ్వానాన్ని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) తిరస్కరించడంపై తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేత వి.హనుమంతరావు స్పందించారు. ఇటీవల ప్రగతి భవన్ కు వెళ్లాక ప్రశాంత్ కిశోర్ మనసు మార్చుకున్నారని వీహెచ్ ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో చేరకూడదన్న ప్రశాంత్ కిశోర్ నిర్ణయం వెనుక కారణాలేంటో తెలియవని అన్నారు. పార్టీలో పీకే చేరిక అంశాన్ని కొందరు వ్యతిరేకించారని తెలిపారు.
అటు, తాజా పరిణామాలపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు స్పందించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, ఆ రెండు పార్టీలను కలిపేందుకు పీకే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.
అటు, తాజా పరిణామాలపై బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు స్పందించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటేనని, ఆ రెండు పార్టీలను కలిపేందుకు పీకే ఒప్పందం చేసుకున్నారని వ్యాఖ్యానించారు.