రుయా ఘటనలో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన‌ ఏపీ ప్ర‌భుత్వం

  • ఆసుప‌త్రి సీఎస్ఆర్ఎంవోపై స‌స్పెన్ష‌న్ వేటు
  • సూప‌రింటెండెంట్‌కు షోకాజ్ నోటీసుల జారీ
  • టీడీపీ ఆరోప‌ణ‌ల‌పై మంత్రి రోజా ఆగ్ర‌హం
ఆసుప‌త్రిలో చ‌నిపోయిన బాలుడి మృత‌దేహాన్ని అత‌డి ఇంటికి త‌ర‌లించే విష‌యంలో తిరుప‌తి రుయా ఆసుప‌త్రి వ‌ద్ద ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవ‌ర్లు సాగించిన దందాపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా స్పందించింది. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ... దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. తాజాగా తిరుప‌తి బాలాజీ జిల్లాకు చెందిన మంత్రి రోజా కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు.

ఈ ఘ‌ట‌న‌కు బాధ్యులుగా గుర్తిస్తూ ఆసుప‌త్రి సీఎస్ఆర్ఎంవోను స‌స్పెండ్ చేశామ‌ని రోజా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామ‌ని ఆమె తెలిపారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే త‌మ ప్రభుత్వం చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మిస్తే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న కుమారుడు నారా లోకేశ్‌లు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నార‌ని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News