తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై చంద్రబాబు ఆవేదన
- రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడి మృతి
- అంబులెన్స్ డ్రైవర్ల కాఠిన్యం
- డబ్బు లేక బైక్ పై మృతదేహాన్ని తీసుకెళ్లిన తండ్రి
- హృదయం క్షోభిస్తోందన్న చంద్రబాబు
తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందగా, తండ్రి ఆ మృతదేహాన్ని బైక్ పై 90 కిమీ తీసుకెళ్లాల్సి వచ్చిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో బాలుడి మృతి పట్ల తన హృదయం క్షోభిస్తోందని పేర్కొన్నారు. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సమకూర్చాలని ఆ బాలుడి తండ్రి అధికార వర్గాలను వేడుకున్నా ఫలితం లేకపోయిందని తెలిపారు.
ఆసుపత్రి అంబులెన్స్ లు ఉన్నా ఉపయోగం లేని పరిస్థితుల్లో, ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ముందుకొచ్చినా, ఆ పేద తండ్రి అంత ఖర్చు భరించలేకపోయాడని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కన్నబిడ్డ శవాన్ని బైక్ పై వేసుకుని 90 కిలోమీటర్లు ప్రయాణించారని వివరించారు. హృదయాలను మెలితిప్పే ఈ విషాదం రాష్ట్ర ఆరోగ్య రంగ దుస్థితికి నిదర్శనం అని చంద్రబాబు తెలిపారు. జగన్ పాలనలో ప్రతిదీ లోపభూయిష్టమేనని విమర్శించారు.