వీడియోతో నవనీత్ కౌర్ ఆరోపణలను కొట్టిపారేసిన ముంబై పోలీస్ కమిషనర్
- దళిత మహిళగా తనకు మంచి నీళ్లూ ఇవ్వలేదన్న నవనీత్
- నేరుగా లోక్ సభ స్పీకర్‌కే ఫిర్యాదు చేసిన అమరావతి ఎంపీ
- ఆమె ఆరోపణలు అవాస్తవమన్న ముంబై పోలీస్ కమిషనర్
- 12 సెకన్ల నిడివి కలిగిన వీడియో విడుదల చేసిన వైనం
హనుమాన్ ఛాలీసా వివాదంలో తనను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు.. దళిత మహిళ అన్న వివక్షతో పోలీస్ స్టేషన్‌లో తనకు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి విదితమే. అయితే, ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు.
మంచి నీళ్లేం ఖర్మ? ఎంపీ అయిన నవనీత్, ఎమ్మెల్యేగా ఉన్న ఆమె భర్త రవి రాణాలకు ఏకంగా కాఫీలు కూడా తమ పోలీసులు అందించారని ఆయన తెలిపారు. ఈ మేరకు కమిషనర్ ఓ వీడియోను విడుదల చేశారు.
12 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నవనీత్, రవి రాణాలు పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నారు. వారి ముందు ఉన్న టేబుల్‌పై కాఫీ కప్పులు ఉన్నాయి. ఆ కాఫీని సేవిస్తూ నవనీత్ కౌర్ కనిపిస్తున్నారు. పోలీసులు తనపై వివక్ష చూపారంటూ నవనీత్ నేరుగా లోక్ సభ స్పీకర్‌కే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీస్ కమిషనర్ ఈ వీడియోను విడుదల చేశారు.