ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని నటించాను: హీరో రామ్ చ‌ర‌ణ్‌

  • చిరంజీవితో క‌లిసి న‌టిస్తుస్తున్నందుకు ఒత్తిడిగా అనిపించిందా? అని మీడియా ప్ర‌శ్న‌
  •  కచ్చితంగా కొంచెం ఒత్తిడి ఉంటుందని చరణ్ వ్యాఖ్య‌
  • కొద్దిగా ఒత్తిడి ఉంటేనే మ‌రింత బాగా ప‌నిచేస్తార‌ని వివ‌ర‌ణ‌
ఆచార్య సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఆ సినిమా యూనిట్ మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడింది. ''ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తోన్న స‌మ‌యంలోనే ఆచార్య సినిమాలోనూ న‌టించారు. ఆర్ఆర్ఆర్ లోని పాత్ర‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఆచార్య‌లోని పాత్ర‌లోకి రావ‌డానికి ఎంత స‌మ‌యం ప‌ట్టేది? చిరంజీవితో క‌లిసి న‌టిస్తుస్తున్నందుకు ఒత్తిడిగా అనిపించిందా?'' అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ స‌మాధానం ఇచ్చాడు. 

''ఆచార్య క‌థ విన్న‌ప్పుడే ఆ పాత్ర నాకు బాగా ఒంట బ‌ట్టింది. కొర‌టాల‌ శివ గారూ స్క్రిప్ట్ రాసుకునేట‌ప్పుడే ఆయ‌న కూడా ఆ పాత్ర‌ను న‌ర‌న‌రాల్లో ఎక్కించేసుకున్నారు. రాజ‌మౌళి గారు చెప్పిన‌ట్లు నేను ఆర్ఆర్ఆర్ నుంచి ఆచార్య షూటింగుకు ఒక ఖాళీ కాగితంలా వెళ్లాను. ద‌ర్శ‌కుల ద్వారా ఆయా సినిమాల పాత్ర‌లు అర్థం చేసుకుని ఆ పాత్ర‌ల్లో లీన‌మైపోతాను. 

పాత్ర‌ల‌ను అర్థం చేసుకోగ‌లిగితే వాటిని ఒంట‌బ‌ట్టించుకుంటాము. వేరే సినిమాల్లో చాలా క‌ష్ట‌ప‌డి న‌టించాల్సి వ‌స్తుంది. కొర‌టాల శివ వంటి ద‌ర్శ‌కుల స్క్రిప్ట్ లో చాలా బ‌లం ఉంటుంది. పాత్ర‌ల్లో న‌టించ‌డం సుల‌భం అవుతుంది. నా హిట్ సినిమాల‌న్నింటిలోనూ ఈ అనుభ‌వాన్ని నేను చ‌విచూశాను'' అని రామ్ చ‌ర‌ణ్ చెప్పాడు.

''చిరంజీవితో క‌లిసి న‌టిస్తుస్తున్నందుకు ఒత్తిడిగా అనిపించిందా?'' అన్న రెండో ప్ర‌శ్న‌కు చ‌ర‌ణ్ స్పందిస్తూ... ''కచ్చితంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. అయితే, కొద్దిగా ఒత్తిడి ఉంటేనే మ‌రింత బాగా ప‌నిచేస్తార‌ని అంటారు. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని నటించాను'' అని తెలిపాడు.


More Telugu News