ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్కు బండి సంజయ్ బహిరంగ లేఖ
- అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారన్న సంజయ్
- నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్నారని విమర్శ
- ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడని ప్రశ్న
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయనపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సాక్షిగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నోటిఫికేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఇంకా 63,425 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇంకెప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ రాసినట్లు బండి సంజయ్ చెప్పారు.
పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మిగతా పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన చేసి 45 రోజులు అవుతోందని, 16,614 పోలీసు పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేశారని ఆయన అన్నారు.