దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 15,636.. పూర్తి అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 2,483 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 1,970 మంది రోగులు
  • మాస్క్ లను తప్పని సరి చేసిన పలు రాష్ట్రాలు
భారత్ లో కరోనా వ్యాప్తి నిలకడగా కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసులు కొంచెం అటూఇటుగా 2 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4,49,197 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 2,483 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 

ఇదే సమయంలో 1,970 మంది కరోనా నుంచి కోలుకోగా... 1,399 మంది మృతి చెందారు. కేరళ సహా పలు రాష్ట్రాలు మరణాలను సవరించిన నేపథ్యంలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 0.55 శాతంగా ఉండగా... రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కొన్ని రోజులుగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మళ్లీ మాస్క్ లను తప్పనిసరి చేశాయి. దేశంలో ఇప్పటి వరకు 187 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులను వేశారు. నిన్న ఒక్కరోజే 22.83 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు.


More Telugu News