'ఆచార్య'లో చరణ్ కనిపించేది ఎంతసేపంటే .. !
- ఈ నెల 29న 'ఆచార్య' రిలీజ్
- అభిమానుల్లో పెరుగుతున్న ఉత్సాహం
- 45 నిమిషాల పాటు సాగే చరణ్ పాత్ర
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
ఇప్పుడు అందరి దృష్టి 'ఆచార్య' పైనే ఉంది. ఈ నెల 29వ తేదీన థియేటర్లకు రానున్న ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ ఎంతసేపు కనిపించనున్నాడనేది మొదటి నుంచి అందరిలో ఆసక్తిని రేపుతున్న విషయం. ఇక ఇంటర్వెల్ కి ముందు ఆయన కనిపిస్తాడా? ఆ తరువాత ఎంట్రీ ఇస్తాడా? అనేది మరో ప్రశ్నగా చర్చల్లో ప్రధానమైన అంశమై కూర్చుంది.
ముందుగా ఈ సినిమాలో 'సిద్ధ' అనే పాత్రను గెస్టుగా చూపించాలని అనుకున్నారు. తెరపై ఈ పాత్రను ఓ 15 నిమిషాల పాటు చూపించాలనుకున్నారు. కానీ ఆ పాత్రలో మంచి స్టఫ్ ఉండటంతో పెంచుతూ వెళ్లారట. అలా 15 నిమిషాలు మాత్రమే అనుకున్న ఈ పాత్ర నిడివి 45 నిమిషాలకు పెరిగినట్టుగా చెబుతున్నారు.
చరణ్ పాత్ర ఇంటర్వెల్ కి ముందు .. ఆ తరువాత కూడా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనుంది. చిరంజీవి - మణిశర్మ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్లే. అదే దారిలో ఈ సినిమా కూడా వెళుతుందేమో చూడాలి.