ఓ ట్యాక్స్ పేయర్‌గా అడుగుతున్నాను: ధోనీ భార్య సాక్షి ట్వీట్
- ఝార్ఖండ్‌లో విద్యుత్ సంక్షోభం కొనసాగుతోందన్న సాక్షి
- ఎన్నో సంవత్సరాలుగా ఉందని ట్వీట్
- విద్యుత్ ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నామని వ్యాఖ్య
ఝార్ఖండ్‌లో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి ఎందుకు నెలకొందని ఆమె ప్రశ్నించారు. ''ఒక ట్యాక్స్ పేయర్ గా (పన్ను చెల్లింపుదారు)గా అడుగుతున్నాను.. ఎన్నో సంవత్సరాలుగా ఝార్ఖండ్ లో విద్యుత్ సంక్షోభం ఎందుకు ఉంది? విద్యుత్ ను ఆదా చేయడానికి మా వంతు కృషి చేస్తూనే ఉన్నాం. అయినా.. విద్యుత్ సంక్షోభం ఉంది'' అని సాక్షి ధోనీ ట్వీట్ చేశారు. విద్యుత్ సంక్షోభంపై ప్రశ్నించిన ఆమెకు మద్దతు తెలుపుతూ పలువురు నెటిజన్ లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.