చైనాలో కరోనా కల్లోలం.. షాంఘై నగరంలో ఒక్క రోజే 51 మంది మృతి
- చైనాలో ప్రతాపం చూపుతున్న కరోనా మహమ్మారి
- దేశ ప్రధాన భూభాగంలో ఏకంగా 20,190 కేసుల నమోదు
- బీజింగ్ లో వీవీఐపీలు ఉండే ప్రాంతంలో అలజడి రేపిన కరోనా
చైనాపై కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ఆ దేశ ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. చైనాలోని కీలక నగరం షాంఘైలో కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 51 మంది కరోనా కారణంగా చనిపోవడం కలకలం రేపుతోంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నమోదయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఒక్క రోజే 20,190 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోవైపు చైనా రాజధాని బీజింగ్ లో 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 11 కేసులు వీవీఐపీలు ఉండే చయోయంగ్ ప్రాంతంలో నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోంది. దాదాపు 35 లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించబోతున్నారు.