ప్రత్యేక హోదా ఇస్తామంటే ఎవరితో జట్టు కట్టేందుకైనా ఓకే: పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామన్న నాని
- వైసీపీని ఎవరూ శాసించలేరని స్పష్టీకరణ
- మంత్రి పదవి కంటే జగన్ ఇస్తున్న గౌరవమే ఎక్కువన్న మాజీ మంత్రి
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కాగితంపై రాసి ఇచ్చే ఏ పార్టీతోనైనా పొత్తుకు తాము సిద్ధమని అన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిన్న విలేకరులతో మాట్లాడిన నాని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేలా ప్రశాంత్ కిషోర్ వైసీపీకి దిశా నిర్దేశం చేస్తున్నారా? అన్న ప్రశ్నకు నాని బదులిస్తూ.. అలాంటిదేమీ లేదన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచనలు, తెలివితేటలను మాత్రమే ఎన్నికల్లో వాడుకుంటామన్నారు. వైసీపీని ఎవరూ శాసించలేరని తేల్చి చెప్పారు. తనకు మంత్రి పదవి కంటే సీఎం జగన్ ఇస్తున్న గౌరవమే ఎక్కువని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్ని నాని చెప్పుకొచ్చారు.