ధావన్ ధమాకా... పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు
- వాంఖెడేలో పంజాబ్ వర్సెస్ చెన్నై
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
- మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 రన్స్
- 59 బంతుల్లో 88 రన్స్ చేసిన ధావన్
ఓపెనర్ శిఖర్ ధావన్ ధాటిగా ఆడడంతో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసింది. ధావన్ 59 బంతుల్లో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్ స్కోరులో 9 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (18) అవుటైన తర్వాత... ధావన్ కు భానుక రాజపక్స నుంచి విశేష సహకారం లభించింది. ఎడమచేతివాటం రాజపక్స 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. ఆఖర్లో లియామ్ లివింగ్ స్టోన్ 7 బంతుల్లోనే 1 ఫోర్, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 2, మహీశ్ తీక్షణ 1 వికెట్ తీశారు.