వివేకా హ‌త్య కేసు నిందితుల బెయిల్ పిటిష‌న్ విచారించ‌బోన‌న్న హైకోర్టు జ‌డ్జి

  • బెయిల్ కోరుతూ వివేకా హ‌త్య కేసు నిందితుల పిటిష‌న్‌
  • జ‌స్టిస్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్ బెంచ్‌కు పిటిష‌న్‌
  • వేరే బెంచ్‌కు పంపాలంటూ జ‌స్టిస్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్ ఆదేశం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో నిందితుల బెయిల్ పిటిష‌న్‌ను విచారించేందుకు ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్‌ తిర‌స్క‌రించారు. ఈ మేర‌కు త‌న బెంచ్ మీద‌కు వ‌చ్చిన వివేకా హ‌త్య కేసు నిందితుల బెయిల్ పిటిష‌న్‌ను వేరే బెంచ్‌కు మార్చాల‌ని ఆయ‌న హైకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు.

వివేకా హ‌త్య కేసులో అరెస్టయిన సునీల్ కుమార్ యాద‌వ్‌, ఉమాశంక‌ర్ రెడ్డిలు త‌మ‌కు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు వీరి పిటిష‌న్‌ను హైకోర్టు రిజిస్ట్రీ జ‌స్టిస్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్‌ బెంచ్‌కు రిఫ‌ర్ చేసింది. ఈ పిటిష‌న్ సోమ‌వారం నాడు త‌న బెంచ్ మీద‌కు రాగానే.. జ‌స్టిస్ మాన‌వేంద్ర‌నాథ్‌రాయ్‌ ఈ పిటిష‌న్‌ను తాను విచారించ‌బోన‌ని తేల్చి చెప్పారు. పిటిష‌న్‌ను వేరే బెంచ్‌కు పంపాల‌ని ఆయ‌న హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు.


More Telugu News