వారెన్ బఫెట్‌ను దాటేసిన అదానీ!... పీఎంఓకు గ్రీటింగ్స్ చెప్పిన లేడీ జర్నలిస్ట్!
- సంపదలో సత్తా చాటుతున్న అదానీ
- తాజాగా ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానానికి ఎగబాకిన వైనం
- ఆంగ్ల ఛానెల్ కథనంపై లేడీ జర్నలిస్టు వ్యంగ్యం
అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ సంపదలో అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు తెలిసిందే. ఇప్పటికే భారత అపర కుబేరుడిగా ఏళ్ల తరబడి కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీని కూడా పలుమార్లు దాటేసిన అదానీ... తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ గురుగా పేరు గాంచిన వారెన్ బఫెట్‌ను కూడా అధిగమించేశారు. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత ధనికుల్లో ఐదో స్థానానికి ఎగబాకారు.
ఈ మేరకు గౌతం అదానీకి చెందిన ఈ వార్తను ఓ ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ కు చెందిన వెబ్ సైట్ ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనంపై స్వాతి చతుర్వేది అనే మహిళా జర్నలిస్టు సెటైర్లు సంధించారు. వారెన్ బఫెట్‌ను దాటేసి ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానంలో నిలిచినందుకు అదానీకి గ్రీటింగ్స్ చెప్పడానికి బదులుగా ఆమె ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)కు గ్రీటింగ్స్ చెప్పారు. ఆంగ్ల న్యూస్ ఛానెల్ కథనాన్ని అటాచ్ చేసిన చతుర్వేది... మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ పీఎంఓకు గ్రీటింగ్స్ చెప్పారు.