'హరి హర వీరమల్లు' షూటింగులో పవన్!

'హరి హర వీరమల్లు' షూటింగులో పవన్!
  • 'వీరమల్లు'గా పవన్ కల్యాణ్ 
  • మొగల్ కాలంలో జరిగే కథ 
  • కథానాయికగా నిధి అగర్వాల్ 
  • సంగీత దర్శకుడిగా కీరవాణి
క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. 'భీమ్లా నాయక్' సినిమా కారణంగా ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా తాజా షెడ్యూల్ మొదలైంది.
 
ఇది మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథ .. ఆ కాలంలో వజ్రాల దొంగతనం చేసే ఒక గజదొంగ కథ. అందువలన ఆ కాలం నాటి సెట్స్ ను భారీ స్థాయిలో వేశారు. అలా ప్రత్యేకంగా వేసిన సెట్లో ప్రస్తుతం షూటింగు చేస్తున్నారు. షూటింగ్ పూర్తయిన తరువాత పవన్ .. క్రిష్ అవుట్ పుట్ ను చూస్తున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా వదిలారు. 

 చారిత్రక నేపథ్యం కలిగిన కథలను తెరకెక్కించడంలో క్రిష్ కి మంచి అనుభవం ఉంది. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'పంచమి' అనే పాత్రలో కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆ ఆకర్షణగా నిలవనుంది.


More Telugu News