గతంలో ఉద్యమం చేశారని... ప్రభుత్వం ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోంది: చంద్రబాబు

  • పార్టీ సభ్యత్వాలపై చంద్రబాబు సమీక్ష
  • పార్టీ నేతలతో సమావేశం
  • వైసీపీ సర్కారుపై విమర్శలు
  • హక్కుల కోసం ఉద్యమించడం తప్పా? అంటూ ఆగ్రహం
పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంతకుముందు పీఆర్సీ, ఇతర డిమాండ్ల విషయంలో ఉద్యోగులతో కలిసి ఉపాధ్యాయులు ఉద్యమం చేపట్టారని, ఇప్పుడు సీపీఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. 

హక్కుల కోసం సమైక్య పోరాటం చేయడం కుదరదనేలా ఉపాధ్యాయులను అరెస్ట్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. హక్కుల కోసం ఉద్యమించడం తప్పా? అని నిలదీశారు. విద్యాసంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చడం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో ఉపాధ్యాయులు మే 20 వరకు పనిచేయాల్సిందేనని, ఆ తర్వాతే సెలవులు అని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.


More Telugu News