ఎంపీ నవనీత్ కౌర్‌కు చుక్కెదురు.. కేసు కొట్టివేతకు బాంబే హైకోర్టు నిరాకరణ
- కేసు కొట్టివేతకు హైకోర్టు ససేమిరా
- నవనీత్ కౌర్ దంపతుల తీరుపై ఆసంతృప్తి
- ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని హితవు
- ఎక్కడ పడితే అక్కడ హనుమాన్ ఛాలీసా పఠిస్తారా? అంటూ ప్రశ్న
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ఇంటి ముందు హనుమాన్ ఛాలీసా పఠిస్తానంటూ ప్రకటించి అరెస్టయిన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాలకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదు చేసిన విద్రోహ కేసును కొట్టివేయాలన్న నవనీత్ దంపతుల పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ సందర్భంగా నవనీత్ కౌర్ దంపతుల వ్యవహార సరళిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని హితవు చెప్పిన కోర్టు... ఇష్టమొచ్చిన చోట హనుమాన్ ఛాలీసా పఠిస్తారా? అంటూ ప్రశ్నించింది. సీఎం ఇంటి ముందు హనుమాన్ ఛాలీసా పఠిస్తామని చెప్పడం బాధ్యతా రాహిత్యం కాదా? అని కూడా కోర్టు నవనీత్ కౌర్ దంపతులను ప్రశ్నించింది.