సీనియర్లతో ముగిసిన సోనియా భేటీ... పీకే చేరికపై వీడని సస్పెన్స్
- పీకే చేరికపై నోరు మెదపని నేతలు
- 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్
- వచ్చే నెలలో రాజస్థాన్‌లో చింతన్ శిబిర్
- సీనియర్లతో భేటీలో సోనియా గాంధీ నిర్ణయాలు
కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరికపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. సోమవారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో పార్టీకి చెందిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై మాత్రం చర్చ జరిగిందా? లేదా? అన్న విషయంపై మాట్లాడేందుకు సీనియర్ నేతలు సాహసించడం లేదు. వెరసి సోమవారం నాటి భేటీలోనూ కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై సస్పెన్స్ వీడలేదు.
ఇదిలా ఉంటే.. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. 2024 ఎన్నికల కోసం ఎంపవర్డ్ గ్రూప్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించింది. అదే సమయంలో చింతన్ శిబిర్ పేరిట నిర్వహించనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశం రాజస్థాన్‌లో వచ్చే నెలలో నిర్వహించాలని కూడా నిర్ణయించింది.