యాదాద్రినా? యాద‌గిరిగుట్ట‌నా?.. రెండు భాష‌ల్లో రెండు పేర్లు

  • యాదాద్రి ప‌ర్య‌ట‌న‌లో సీఎం కేసీఆర్‌
  • సీఎం ప‌ర్య‌ట‌న‌పై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సీఎంఓ
  • తెలుగు ప్ర‌క‌ట‌న‌లో యాద‌గిరిగుట్ట‌గా పేర్కొన్న వైనం
  • ఆంగ్లంలో యాదాద్రి అని రాసి అయోమ‌యం రేపిన ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లోని ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేతం యాద‌గిరి ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి కొలువై ఉన్న యాద‌గిరిగుట్ట‌ పేరులో ఇప్పుడు క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంది. తెలుగు నేల ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో యాద‌గిరిగుట్టగా పిలుస్తున్న ఈ క్షేత్రం పేరును రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత మ‌రింత‌గా అభివృద్ధి చేసేందుకు సంక‌ల్పించిన టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క్షేత్రం పేరును యాదాద్రిగా మార్చింది. అయితే ఇప్పుడు అదే ప్ర‌భుత్వం ఈ క్షేత్రం పేరును రెండు ర‌కాలుగా పేర్కొంటూ జ‌నాన్ని డైల‌మాలో ప‌డేసింది.

సోమ‌వారం సీఎం కేసీఆర్ స‌తీస‌మేతంగా యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కార్యాల‌యం(సీఎంఓ) పీఆర్వో ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ విడుద‌ల చేశారు. 

ఇక ఆంగ్ల ప్ర‌క‌ట‌న‌లో యాదాద్రిగా క్షేత్రం పేరును పేర్కొన్న పీఆర్వో... తెలుగు ప్ర‌క‌ట‌న‌లో మాత్రం యాద‌గిరిగుట్ట‌గా పేర్కొన్నారు. దీంతో ఈ క్షేత్రం పేరును అస‌లు మార్చారా? లేదా? అన్న దిశ‌గా మీడియా ప్ర‌తినిధులు అయోమ‌యానికి గుర‌య్యారు. అదే స‌మ‌యంలో క్షేత్రం పేరును ఏమ‌ని రాయాల‌న్నది తెలియ‌క వారు తిక‌మ‌క ప‌డ్దారు.


More Telugu News