ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు?: జగన్‌పై లోకేశ్ ఫైర్
- సీపీఎస్ రద్దు కోరుతూ సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన యూటీఎఫ్
- యూటీఎఫ్ నేతలను ఎక్కడికక్కడే నిర్బంధించిన ప్రభుత్వం
- నిర్బంధంపై నారా లోకేశ్ సెటైర్లు
- ఇప్పటికైనా హామీని నిలబెట్టుకోవాలని హితవు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సోమవారం నాడు సెటైర్లు సంధించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న జగన్ తన హామీని నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ సోమవారం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూటీఎఫ్ నేతలను ప్రభుత్వం ఎక్కడికక్కడే నిర్బంధించింది.
ఈ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా జగన్‌పై సెటైర్లు సంధించారు. "ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు? శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారు.
మరి వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చెయ్యండి" అని లోకేశ్ ఆ ట్వీట్లలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.