సీపీఎస్‌పై నేడు ఉద్యోగ సంఘాల‌తో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు

  • నేటి సాయంత్రం స‌చివాల‌యంలో భేటీ
  • మంత్రులు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌భ్యుల చ‌ర్చ‌లు
  • చ‌ర్చ‌ల‌కు రావాలంటూ 16 ఉద్యో్గ సంఘాల‌కు ఆహ్వానం
కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం (సీపీఎస్‌)పై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళ‌న‌కు శ్రీకారం చుట్టిన వేళ‌... సోమ‌వారం దీనిపై ఉద్యోగ సంఘాల‌తో ఏపీ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నుంది. సోమ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో మంత్రులు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ స‌భ్యుల‌తో ఉద్యోగ సంఘాలు భేటీ కానున్నాయి. ఈ భేటీకి హాజ‌రు కావాల‌ని 16 ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆహ్వానాలు పంపింది. అయితే యూటీఎఫ్ త‌ల‌పెట్టిన నిర‌స‌న‌ను ప్ర‌భుత్వం ఎక్క‌డిక‌క్క‌డ అణ‌చివేసిన నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఆహ్వానాన్ని ఏ మేర‌కు మ‌న్నిస్తాయ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


More Telugu News