ఎయిడ్స్ బాధిత రాష్ట్రాలలో ఏపీనే నెంబర్ వన్!

  • దశాబ్ద కాలంలో దేశంలో ఎయిడ్స్ బారిన 17.08 లక్షల మంది
  • ఏపీలో 3,18,814 ఎయిడ్స్ కేసుల నమోదు
  • ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక
అరక్షిత లైంగిక కార్యకలాపాల వల్ల మన దేశంలో ఎంతో మంది ఎయిడ్స్ బారిన పడుతున్నారు. కండోమ్స్ వాడకుండానే శృంగారంలో పాల్గొంటుండటం వల్ల ఎయిడ్స్ వ్యాధికి గురవుతున్నారు. మన దేశంలో గత పదేళ్లలో 17.08 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడినట్టు ఎయిడ్స్ నివారణ సంస్థ తాజాగా ప్రకటించింది. 2011 నుంచి 2021 మధ్య కాలంలో 17,08,777 మందికి ఎయిడ్స్ సోకిందని చెపేర్కొంది.  

అయితే ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2011-12 మధ్య కాలంలో 2.4 లక్షల మంది ఎయిడ్స్ బారిన పడగా... 2020-21 మధ్య కాలంలో ఆ సంఖ్య 85,268కి పడిపోయింది. ఏపీలో గత పదేళ్లలో 3,18,814 మందికి ఎయిడ్స్ సోకింది. 

ఇక అత్యధిక ఎయిడ్స్ కేసుల జాబితాలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఎయిడ్స్ నివారణ సంస్థ సమాధానమిచ్చింది.


More Telugu News