లక్నో జట్టుకు షాక్.. జట్టు సభ్యులు అందరికీ భారీగా ఫైన్
- కెప్టెన్ కేఎల్ రాహుల్ కు రూ.24 లక్షలు
- మిగిలిన 10 మంది సభ్యులకు రూ.6 లక్షలు
- మ్యాచ్ ఫీజు నుంచి చెల్లించాలని రిఫరీ ఆదేశాలు
- నిర్ణీత సమయానికి ఫీల్డింగ్ చేయలేకపోవడమే కారణం
ప్రస్తుత ఐపీఎల్ 15వ సీజన్ లో.. ముంబై ఇండియన్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ రెండో సారి విజయం సాధించింది. దీంతో లక్నో జట్టు సంబరాల్లో మునిగిపోగా.. ఐపీఎల్ రిఫరీ ఫైన్ తో షాకిచ్చారు. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు రూ.24 లక్షల ఫైన్ విధించారు.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్ ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి ఫైన్ విధించారు. ఈ సీజన్ లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు. అందుకనే ఇంత ఫీజు పడింది.
మ్యాచ్ లో పాల్గొన్న లక్నో జట్టు మిగిలిన సభ్యులు అందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు ఏది తక్కువైతే అది చెల్లించాలని రిఫరీ ఆదేశాలు జారీ చేశారు. స్లో ఓవర్ రేటు నిబంధన ఈ విడత చాలా మందికి షాకిస్తోంది. నిబంధనల మేరకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు చివరి ఓవర్ (20వ ఓవర్)ను 85వ నిమిషం ముగిసేలోపు తప్పనిసరిగా ప్రారంభించాలి. అంతకు ఆలస్యమైతే ‘స్లో ఓవర్ రేటు’ కింద జరిమానా పడుతుంది.