ఎన్టీఆర్ మాలధారణపై రామ్ చరణ్ స్పందన

ఎన్టీఆర్ మాలధారణపై రామ్ చరణ్ స్పందన
  • కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్న ఎన్టీఆర్
  • హనుమాన్ దీక్ష చేపట్టిన వైనం
  • రామ్ చరణ్ ప్రభావం అంటూ కథనాలు
  • ఎన్టీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడని చరణ్ వెల్లడి
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో దర్శనమిస్తుండడం తెలిసిందే. ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే, గతంలో ఎన్టీఆర్ ఎప్పుడూ మాలధారణ చేయకపోవడంతో, ఈసారి ఆయనపై రామ్ చరణ్ ప్రభావం పడి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై రామ్ చరణ్ స్పందించారు. ఎన్టీఆర్ మాల వేసుకోవడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మాల ధరించాలని ఎన్టీఆర్ ఎప్పటినుంచో అనుకుంటున్నాడని వెల్లడించారు. అది ఇన్నాళ్లకు కుదిరిందని వివరించారు.


More Telugu News