మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్న ప్రధాని మోదీ
- ముంబయిలో కార్యక్రమం
- లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం అవార్డు
- హర్షం వ్యక్తం చేసిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు అందుకున్నారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబయిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కరోనా వేళ పూణేలోని మంగేష్కర్ ఆసుపత్రి ఎన్నో సేవలు అందించిందని కితాబిచ్చారు. యోగా, ఆయుర్వేదంలో మనదేశం ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. మనదేశ మూలాల్లోనే పర్యావరణ పరిరక్షణ సూత్రాలు ఇమిడి ఉన్నాయని వివరించారు. కాగా, దీనానాథ్ మంగేష్కర్... లతా మంగేష్కర్ తండ్రి. ఆయన మరాఠీ నటుడిగానూ, హిందూస్థానీ సంగీతకారుడిగానూ ఎంతో పేరుగాంచారు.