మ‌ళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్‌కు అర్థమైంది.. అందుకే ఇలా చేస్తున్నారు: య‌న‌మ‌ల‌

  • ఏపీరూ.7.76 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయింద‌న్న య‌న‌మ‌ల‌
  • రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం క‌ట్ట‌డి చేయాల‌ని విజ్ఞ‌ప్తి
  • ఏపీని జ‌గ‌న్ మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారని ఆరోప‌ణ‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. సీఎం జగన్ పాల‌న‌లో ఏపీ రూ.7.76 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి కూరుకుపోయింద‌ని ఆయ‌న చెప్పారు. జగన్ మరోసారి బహిరంగ మార్కెట్‌, కార్పొరేషన్ల రుణాలను తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం క‌ట్ట‌డి చేయాల‌ని ఆయ‌న కోరారు. 

ఏపీలో మ‌రోసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్‌కు అర్థమైందని ఆయ‌న అన్నారు. అందుకే ఆయ‌న ఏపీని మరింత అప్పుల ఊబిలోకి నెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల సంక్షేమం కోసం గురించి ఆలోచించకుండా త‌న పార్టీ గురించే జ‌గ‌న్ ఆలోచిస్తున్నార‌ని యనమల చెప్పారు.  

అవినీతి సొమ్ముతో వ‌చ్చే ఎన్నికలలో అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారని ఆయ‌న అన్నారు. ఏపీలో ఆదాయం లేక ప్ర‌జా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. ఏపీని దుష్ట చతుష్టయం పట్టి పీడీస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజలను వైసీపీ నేత‌లు స‌మ‌స్య‌ల్లో నెట్టేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌శ్నిస్తోన్న‌ ప్రతిపక్ష నేత‌ల‌పై అక్రమ కేసులు పెడుతున్నార‌ని చెప్పారు. 



More Telugu News