జార్ఖండ్‌లో దారుణం.. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్ల అత్యాచారం
- బాలికను అడ్డగించి అత్యాచారానికి ఒడిగట్టిన బాలురు
- నిందితులందరూ 10-15 ఏళ్ల లోపు వారే
- అరెస్ట్ చేసి కరెక్షన్ సెంటర్‌కు తరలించిన పోలీసులు
జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లా దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి తెగబడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూసింది. నిందితులు 10 నుంచి 15 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన ఓ వివాహానికి హాజరైంది. అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం సందర్భంగా తనకు ఇంతకుముందే తెలిసిన నిందితులతో వాగ్వివాదం జరిగింది.
వివాహం అనంతరం బాలిక మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్ధరాత్రి వేళ స్వగ్రామానికి పయనమైంది. వారి వెనకే వస్తున్న బాలలు ఆమెను అడ్డగించారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాధిత బాలిక స్నేహితురాళ్లు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే, ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బాధిత బాలిక తల్లిదండ్రులు తొలుత నిరాకరించారు. విషయం బయటకు వస్తే తమ పరువు పోతుందని సంశయించారు. చివరికి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన ఆరుగురినీ అరెస్ట్ చేసి కరెక్షనల్ కేంద్రానికి పంపించారు.